హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు ?
గుడి కి వెళ్ళిన వారు
తప్పనిసరిగా గంట కొడుతారు . ఇంట్లో లేక గుడిలో పూజ చేస్తున్నప్పుడు, హారతి
ఇచ్చే సమయం లో గంట కొడుతారు. ఆలయం లో ఉన్న గంటలలో అర్దాలు చాలానే ఉన్నాయి .
దేవాలయం వెళ్ళినప్పుడు గంటకోడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమేకాక,సకల
శుభాలు కలుగుతాయి.
గంట విషయానికి వస్తే … గంట లోని ప్రతి భాగానికి ఓ ప్రత్యేకత ఉంది … అదేంటంటే …
గంట
నాలుక లో సరస్వతీ మాత కోలువై ఉంటుందట. గంట ఉదర భాగం లో మహా
రుద్రుడు,బ్రహ్మ దేవుడు ముఖ భాగం లోను, కొన భాగం లో వాసుకి మరియు పైన వుండే
పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి .
అందుకే గంటను పవిత్రం గా భావించి దైవం గా పూజించాలి.
మనకు
భాదలు , మనశ్శాంతి కరువైనపుడు ..మన మనస్సు ను ఆధ్యాత్మిక భావనతో నింపాలంటే
భగవంతుని ముందు కంచు తో చేసిన గంటను మ్రోగిస్తే , ఆ గంట నుండి వచ్చే
“ఓంకార” శబ్దం వలన దుష్ట శక్తులు దూరం గా పోయి , మన బాధలు తొలగుతాయని “కర్మ
సిద్దాంతం” మనకు తెలుపుతుంది. “హారతి” సమయం లో గంటకోడితే, మన ఇంటిలో లేదా
దేవాలయం లో దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని
అర్ధం.హారతి సమయం లో గంట కొట్టే సమయం లో కళ్ళు మూయరాదు. ఆ సమయం లో హారతి
ఇస్తూ , గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని
అర్ధం.
కొన్ని ఆలయాల్లో గంటల గుత్తి మనం చూస్తుంటాం , అలాంటి గంటలు మ్రోగిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు , అవి కేవలం అలకారం కొరకు మాత్రమె.
No comments:
Post a Comment