భార్య గర్భిణిగా ఉన్నప్పుడు చేయకూడని పనులు
శ్లో|| గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాద్యథోచితం | సూతే చిరాయుషం పుర్తమన్యథా దోషమర్హతి||
గర్భిణీ
స్త్రీ గోరిన వస్తువును ఉచితమైనదానిని తెచ్చియిచ్చుట భర్త యొక్క ముఖ్య
ధర్మము. చిరాష్మంతుడగు పుత్రుడు గల్గును. లేనిచో దోషము గల్గును.
మఱియు
సముద్ర స్నానము, చెట్లు నరుకుట, క్షౌరము, శవము మోయుట, విదేశ ప్రయాణము
చేయరాదు. ఏడవనెల మొదలయిన నాటి నుండి క్షౌరము, మైథునము, తీర్థయాత్ర,
శ్రాద్ధభోజనము, నావయెక్కుట విడువ వలెను. పర్వతా రోహణము, యుద్ధములు జేయుట,
గృహమునకు స్తంభ ముహూర్తముగానీ, గృహారంభముగానీ, వాస్తుకర్మ గానీ చేయరాదు. నఖ
కేశములు కత్తిరించుట, కుమారునకు చౌలకర్మ చేయుట, వివాహము, ఉపనయనము,
పిండదానము, శవమును అనుసరించి వెళ్ళుట, ప్రేతకర్మలు చేయుట చేయరాదు.
No comments:
Post a Comment