ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉంటే ఇలా చేసి చూడండి
మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు,
బయట లోపల లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు
బంగారపు కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచినట్టైతే మీ
ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.
లక్ష్మి దేవికి 7 శుక్రవారాలు, 7
ముత్తైదువులకు, ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి ( కుంకం, పసుపు, చందనం,
తాంబూలం, వీలు అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ ) కానుకగా
ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి మంచి ని తప్పక లక్ష్మి దేవి
చేకూర్చుతుంది.
మీ ఇంటి లో ఉండే దేవుని మందిరం లో,ఒక మంచి
రోజు, ఒక కుంకుమ భరిణలో “గోమతి చక్రం” అనేది కుంకుమ భరిణలో ఉంచి
మూతపెట్టి, కదిలించకుండా, దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది
కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని
సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.( గోమతి చక్రం- పూజా
సామగ్రి దొరికే దుకాణం లో దొరుకును ).
గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .
మూత లేకుండా “డస్ట్ బిన్” ఉండకూడదు, పగిలిన అద్దము ఉండకూడదు ఇంటిలో
No comments:
Post a Comment