•...:-> చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు

లోకాలకు వెలుగును ... జీవులకు చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆయన కదలికలపైనే సమస్త జీవకోటి ఆధారపడి వుంటుంది. అందుకే రుషి గణాలు ... దేవతలు ఆ స్వామిని ప్రతినిత్యం పూజిస్తూ ... సేవిస్తూ వుంటారు. అలాంటి సూర్య భగవానుడికి దోసిటతో అర్ఘ్యం వదిలి ఓ నమస్కారం సమర్పిస్తే సంతృప్తి చెందుతాడు. పొగడలు ... మందారాలు ... సంపెంగలు ... పున్నాగలు ... గన్నేరులు ... తామరలు ... జాజులు ... గులాబీలు ... నాగకేసారాలు ... మొల్లలు ... మొగలి పూలు ... మోదుగలు ... అవిసెలు ... విష్ణు తులసి ... కృష్ణ తులసి సూర్య భగవానుడుకి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. స్వామిని పువ్వులతో పూజించాలనుకుంటే, ఆయనకి ఇష్టమైన పువ్వులను సమర్పించ వలసి వుంటుంది.
•
•ఆచారాలు ...
తమలపాకు మంగళప్రదం, ప్రతి శుభకార్యానికి తమలపాకు వుండాలి, తమలపాకు తోదిమలో లక్ష్మి, మద్యలో పార్వతి, కొనలో సరస్వతి కొలువై వుంటారు,. ఉపవాస వేళల్లో తమలపాకు తినరాదు, చిరిగినా కన్నం పడిన, తోడిమలేని తమలపాకు పూజకి ఉపయోగించరాదు.. వక్క లేకుండా ఇతర వ్యక్తులకి గాని, దేవతలకి కాని ఇవ్వడం దోషం .. హనుమతాది దేవతలకి తమలపాకు పూజ సమయంలో వక్క అవసరం లేదు . తాంబూలం గ ఇచ్చేటపుడు వక్క ఉండాలి..

No comments:

Post a Comment