కలలోకి దేవుళ్ళు రావడం మంచిదేనా? తెల్లవారు జామున కలలు నిజమవుతాయా ?
రాత్రి పూట స్వప్నాలలో దేవతలు కనిపించుట చాలా మంచిది. మనం రోజంతా ఏ
కార్యములో మునిగి ఉంటే తప్పక ఆ రోజు రాత్రి మన మనసంతా దాని పైనే ధ్యాస
పెట్టబడి ఉంటుంది కనుక రాత్రి పూట మన స్వప్నాలలోకి వస్తుంటాయి. ఐతే మనం ఈ
రోజంతా దైవారాదన చేసి ఉండడం వల్ల ఇలా కల్లోకి దేవుళ్ళు రావడం సహజమే. కానీ
ప్రత్యేకంగా దైవ చింతన చేయ్యకపోయినా, మీ కల్లోకి దేవుళ్ళు వచ్చారనుకుంటే,
అది చాలా చాలా మంచిది. రాక్షసులు, దెయ్యాలు, ఘోరమైన సంఘటనలు వచ్చుట చాలా
దోషము. ఇలాంటి కలలు సంభవించిన మీకు సరియగు నిద్ర కూడా ఉండదు. ఇక దేవుళ్ళు
కలలోకి వస్తే మనపై దైవ అనుగ్రహం ఉన్నదనే మనం తెలుసుకోవాలి. ఇలా జరిగిన
సంఘటనల తర్వాత మరికొంత భక్తి, శ్రద్దలతో ఆ కలలోకి వచ్చిన దైవాన్ని ఇష్ట
పూర్వకంగా పూజిస్తే దైవాను గ్రహం త్వరగా లభించి కోరికలు సిద్దిస్తాయి.
ఇక
తెల్ల తెల్లవారు జామున కలలు వస్తే మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం,
మనకు ఆ తెల్లవారు జామున వచ్చిన కలలను మర్చిపోతాము. మళ్ళీ అలాంటి సంఘటన మనకు
ఎప్పటికైనా ఎదురవుతుంది. అప్పుడు మన మనసులో ఆలోచిస్తాము. ఇది ఎప్పుడో
జరిగింది, ఎక్కడో జరిగింది, ఇక్కడకు నేను వచ్చాను, అని మనసులో ఎదో
జరుగుతుంది, ఇది మనకు ఇదివరకే జరిగినట్టు ఇలాంటి సంఘటనలు కొద్ది మందికే
ఎదురవుతాయి అప్పుడప్పుడు
No comments:
Post a Comment