“బ్రహ్మ ముహూర్తానికి”, హిందూ మతం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.పురాణాల కధ ఇలా ఉంది …
కశ్యప
బ్రహ్మ , వినత ల తనయుడు “అనూరుడు “.సూర్యుని సారధి గా పుత్రున్ని చూడాలన్న
కోరికతో “వినత” తన అండం ముందుగా పగులగొట్టి సగం శరీరం ఉన్న “అనూరుడిని”
బయటకు తెచ్చింది.బ్రహ్మ దేవుడు “అనూరుడిని” ,సూర్యునికి సారధిగా నియమించి ,
నీవు భూలోకం లో మొదటగా కనిపించిన కాలాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయం
లో గ్రహాలు,నక్షత్రాలు ఎటువంటి చెడు చేయలేవని వరమిచ్చాడు.
ఒక
పనిని ప్రారంభించడానికి ఒక సమయాన్ని అనుకొంటూ ఉంటాం , అలా నిర్ణయించుకున్న
సమయాన్ని ముహుర్తం అంటారు. ఏదైనా ఒక పని చేయాలనుకోన్నప్పుడు ఎలాంటి
ఆటంకాలు కలుగకుండా ఒక మంచి సమయాన్ని చూసుకొని దానిని మంచి ముహుర్తం గా
నిర్ణఇస్తారు. తెల్లవారుజామును (సూర్యోదయానికి ముందు ఉన్న కాలం ) మంచి
ముహుర్తం అంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు.
తెల్లవారుజామున రెండు ఘడియల ముందు కాలాన్ని ( 48 నిమిషముల ముందు కాలాన్ని )
“ఆసురీ ముహూర్తం” అని “ఆసురీ ముహుర్తానికి” ముందు “48 నిమిషముల” ముందు
కాలాన్ని “బ్రహ్మ ముహూర్తం” అంటారు.
తెల్లవారుజామున
ప్రారంబించే పనులు ఏటువంటి ఆటంకాలు సాగుతాయంటారు.ప్రతి దినం
బ్రహ్మముహుర్తమున ప్రారంబించిన పనులు నిర్విరామం గా , ఎటువంటి ఆటంకము
లేకుండా జరుగుతాయంటారు.ఎక్కువమంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని
ఎన్నుకుంటారు. ఈ సమయం లో పనులో చేస్తే మన మేధస్సుకు , భగవంతుని ఆశీస్సులు
తోడవుతాయని అంటారు. ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది. సత్వగుణ ఆవిర్భావానికి
అనుకూలంగా ఉంటుంది. రోజూ ఆ సమయంలో నిద్ర లేవడం ఉత్తమం. ధ్యానానికి,
చదువుకోవడానికి ఆ రోజు చేయవలసిన సత్కార్యాలను నిర్ణయించుకోవడానికి అది
ఉత్తమ కాలం.బ్రహ్మ ముహూర్తం లో ప్రారంబించాబోయే పనికి తిధి, వార, నక్షత్ర,
దుర్ముహూర్త ములను చూసుకోవలసిన పని లేదు. మంచి పని చేయాల్సివచ్సినా , లేదా
కొత్త గా ఏదైనా కొనిగోలు చేసి ఉపయోగించాల్సి వచ్చినా , ఆటంకాలు కలుగుతాయేమో
అన్న సందేహం లేకుండా ప్రారంబించవచ్చు.
No comments:
Post a Comment